సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ‘శాకుంతలం’ ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల
ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాణంలో .. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా, తెలుగుతో పాటు వివిధ భాషల్లోని ప్రేక్షకులను పలకరించనుంది. ఈ
నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.సమంత ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ కి ఇచ్చినంత ప్రాధాన్యత టాలీవుడ్
కి ఇవ్వడం లేదనే ప్రశ్న ఈ ప్రెస్ మీట్ లో ఎదురైంది. అందుకు సమంత స్పందిస్తూ
..” నాకు కమిట్ మెంట్స్ ఉన్నాయి. కొచ్చిలో ‘ఖుషీ’ షూటింగు జరుగుతున్నప్పుడు
అక్కడ ప్రమోషన్స్ చేశాను. ‘సిటాడెల్’ షూటింగులో ముంబైలో ఉన్నప్పుడు అక్కడ
ప్రమోషన్స్ చేశాను. అంతేగానీ బాలీవుడ్ పై ప్రత్యేకమైన ప్రేమేం లేదు” అని
అన్నారు.

ఆ ప్రశ్నకి దిల్ రాజు స్పందిస్తూ .. “ఒక నిర్మాతగా నేను ఏదైతే డిజైన్ చేస్తానో
అదే మిగతావారు ఫాలో అవుతారు. సమంతగారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ సినిమా
ప్రమోషన్స్ ను ఏర్పాటు చేస్తూ వచ్చాను. అంతే తప్ప తెలుగును పట్టించుకోకపోవడమేం
లేదు. మూడు రోజులుగా తెలుగు వెర్షన్ కి సంబధించిన ప్రమోషన్స్ లోనే ఉన్నాము”
అని చెప్పుకొచ్చారు.