గుంటూరు : రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు
చేసిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున
హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు, టీడీపీలోని ముస్లిం నేతలు షరీఫ్, ఫరూఖ్, నాగుల్ మీరా ఈ ఇఫ్తార్
విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు నేపథ్యంలో నిర్వహించిన నమాజ్ లో
చంద్రబాబు, అచ్చెన్నాయుడు, తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
ముస్లింలతో సమావేశమైన చంద్రబాబు గతంలో తమ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక
సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. అయితే వైసీపీ వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు
చేసిందని అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా
నిలుస్తామని, దుల్హన్ తదితర పథకాలను మళ్లీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు.