బలగం మూవీలో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి
విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో మొగిలయ్య కొద్దిరోజులుగా వరంగల్
సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం హార్ట్
ప్రాబ్లమ్ కూడా రావడంతో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
కుటుంబ సభ్యులు. దాంతో ఆయనను ఆదుకోవాలని వేడుకుంటోంది మొగిలయ్య భార్య
కొమురమ్మ.మొగిలయ్య ఏడాది కాలంగా బీపీ, షుగర్‌తోపాటు రెండు కిడ్నీలు ఫెయిలై తీవ్ర
అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారానికి మూడుసార్లు వరంగల్‌లోని ఓ ప్రైవేట్
ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నాడు. అయితే.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో
డయాలసిస్ చేయడానికి మొగిలయ్య శరీరం సహకరించడం లేదని వైద్యులు చెప్పారు.
దాంతో.. మొగిలయ్య కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని
వేడుకుంటోంది.

బలగం సినిమాలో క్లైమాక్స్ సాంగ్‌తో కోట్లాది మంది హృదయాలను కదిలించారు
మొగిలయ్య- కొమురమ్మ దంపతులు. బలగం సినిమాతో మొగిలయ్య దంపతులు ప్రత్యేక
గుర్తింపు తెచ్చుకున్నారు. మొగిలయ్యది వరంగల్ జిల్లా దుగ్గొండి. బుడగజంగాల
సామాజికవర్గానికి చెందిన మొగిలయ్య దంపతులు.. బుర్ర కథలు చెబుతూ జీవనం
సాగిస్తున్నారు.