Tollywood లో శుక్రవారం వస్తుందనగానే ఇటు థియేటర్స్ లో ఏ సినిమాలు
వస్తున్నాయి? అటు ఓటీటీ సెంటర్స్ కి ఏ సినిమాలు వస్తున్నాయి? అనే విషయంలో
అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. థియేటర్స్ విషయానికి వస్తే ఈ నెల 14న
పాన్ ఇండియా స్థాయిలో ‘శాకుంతలం’ సినిమా థియేటర్స్ లో దిగిపోనుంది. సమంత
ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.ఇక అదే రోజున లారెన్స్ ‘రుద్రుడు’ .. సూరి ‘విడుదల’ రిలీజ్ కానున్నాయి. ఈ
రెండూ కూడా తమిళం నుంచి వచ్చిన అనువాదాలే. ఆల్రెడీ తమిళనాట ‘విడుదల’ భారీ
వసూళ్లను రాబట్టగా, ‘రుద్రుడు’ మాత్రం తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ ముందుకు
కూడా ఇదే రోజున రానుంది. లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి
ఉంది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే .. ఈ నెల 13వ తేదీన ‘ ఓ కల’ అనే తెలుగు సినిమా
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున ‘అసలు’ తెలుగు
సినిమా ‘ఈటీవీ విన్’ ద్వారా పలకరించనుంది. ఈ సినిమాలో రవిబాబు – పూర్ణ
ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 14 నుంచి ‘ఆహా’ ద్వారా ‘దాస్ కా ధమ్కీ’
పలకరించనుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ లో ‘జూబ్లీ’ ( వెబ్ సిరీస్) సీజన్ 2
స్ట్రీమింగ్ కానుంది. జీ 5లో ‘మిసెస్ అండర్ కవర్’ హిందీ మూవీ కూడా అదే రోజున
స్ట్రీమింగ్ కానుంది.