వైఎస్సార్ ఈబీసీ నేస్తం సీఎం జగన్ మార్కాపురం పర్యటన షెడ్యూల్ ఇదే
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా
మార్కాపురంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో
నగదు జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55
గంటలకు మార్కాపురం చేరుకుంటారు. 10-15 –12-05 గంటలకు ఎస్వీకేపీ డిగ్రీ
కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు
శంకుస్ధాపనలు, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం
లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి
బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.