పవిత్రమైన రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాను ప్రార్ధించడం జరుగుతుంది
ఇఫ్తార్ విందులు సోదరభావం, ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపజేస్తాయి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్.బి అంజాద్ బాషా
కడప : పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులు.. ప్రజల మధ్య సోదరభావం,
ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపజేస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ
సంక్షేమ శాఖ మంత్రి, యస్.బి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప నగరం అగాడి వీధి
లోని మసీద్ ఏ హుస్సేనీయ నందు లో 37వ డివిజన్ ఇంచార్జి రిజ్వాన్ ఆధ్వర్యంలో
నిర్వహించిన ‘దావతే ఇఫ్తార్’ విందు కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
ఎస్.బి.అంజాద్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి
అంజద్ భాష మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాహ్ ను
ప్రార్తించ డం జరుగుతుందని, పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు
కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్య కార్యమని అభినందనీయం అన్నారు. కులమతాలకు
అతీతంగా కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. పవిత్ర దైవారాధనకు,
ధార్మిక చింతనకు, దైవభక్తికి క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలం
అన్నారు. మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి.. రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయన్నారు.
సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ,
సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య
ఉద్దేశ్యం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవం అనుసరించిన
మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కేట్ యార్డు వైస్ ఛైర్మన్ ఇబ్రహీం
మియా, వైసీపీ, మైనారిటీ నాయకులు అప్జల్ ఖాన్, డాక్టర్ సోహైల్ అహమ్మద్,కాల్
టాక్స్ హఫీజుల్లా, సుబాన్ బాషా, సంఘం జాహీరుద్దీన్, డివిజన్ ఇంఛార్జి
రిజ్వాన్,ఇతర కార్పొరేటలు షేక్ మహమ్మద్ షఫీ, బసవరాజు, అరీఫుల్లా, మత
గురువులు, ముస్లిం ప్రముఖులు, మార్కేట్ యార్డు వైస్ ఛైర్మన్ ఇబ్రహీం మియా,
మాజీ కార్పొరేటర్ జాకీరుద్దీన్, వైసీపీ నాయకులు, మైనారిటీ నాయకులు, ముస్లిం
సోదరులు తదితరులు పాల్గొన్నారు.