భారత్‌తో ఆదివారం జరిగిన కీలకమైన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ విజయంలో దక్షిణాఫ్రికా బౌలర్ ఎంగిడి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ తర్వాత బౌలర్ ఎంగిడి విలేకరులతో మాట్లాడాడు. భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని పెవిలియన్ కు పంపడం చాలా సంతోషంగా ఉందన్నాడు. “విరాట్ నాపై రెండు బౌండరీలు కొట్టాడు, కాబట్టి అతను నాపై కొంచెం దాడికి ప్రయత్నించాడు. ఆ (షార్ట్) బంతిని బౌలింగ్ చేయడం, బహుశా అతను దాని కోసం వెళ్తాడని నాకు తెలుసు. ఎక్కడైనా సిక్స్ లేదా చేతిలోకి వెళ్లి ఉండవచ్చు. అదృష్టవశాత్తూ అది నా పక్కనే వెల్లింది” అని అన్నాడు.
మ్యాచ్ ఏడో ఓవర్ ఐదో బంతికి ఎంగిడి బౌన్సర్ విసిరాడు. విరాట్ దాన్ని కట్ చేశాడు. బంతి డీప్ ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. అది చాలా దూరంలో ఉంది. కానీ, రబడ కుడివైపుకి లాంగ్ రన్ చేసి క్యాచ్ పట్టాడు. 11 బంతుల్లో 12 పరుగులు చేసి విరాట్ ఔటయ్యాడు. తబ్రైజ్ షమ్సీ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చిన ఎంగిడి 29 పరుగులకు 4 కీలక వికెట్లు సాధించాడు. ఇందులో ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, కోహ్లి, హార్దిక్ పాండ్యా వికెట్లు పడ్డాయి.