స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లను అంటించిన ఎంపీ
నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాజీవ్ గాంధీ
నగర్ లో జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు
నెల్లూరు రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి
ఇంటికి వెళ్లి వారిచ్చే సలహాలను సూచనలను తీసుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల
సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం
పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్డ్ కాల్
ఇప్పించడంతోపాటు జగనన్న స్టికర్లను అతికించారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ
చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అశోక్ నాయుడు, పెంచల్
రెడ్డి కాకుపల్లి సునీల్, పాశం శ్రీనివాసులు, స్వర్ణ వెంకయ్య, వంశీ,
కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, మూలే విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాసులు
రెడ్డి, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.