కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్
వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ను
తీసుకున్నారు. ఈ సినిమాతోనే కథానాయికగా ఆమె టాలీవుడ్ కి పరిచయమవుతోంది.రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలెట్టిన తాజా షెడ్యూల్ షూటింగులో జాన్వీ కపూర్
జాయిన్ అయింది. ఇక తాజాగా సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ ముగ్గురి
కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ
సందర్భంలో కొరటాల – ఎన్టీఆర్ తో కలిసి సైఫ్ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్
మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సైఫ్ కూడా తెలుగులో చేస్తున్న ఫస్టు మూవీ ఇదే. ఇది భారీ బడ్జెట్ తో
నిర్మితమవుతున్న సినిమా. విదేశాల్లోనే ఈ సినిమా షూటింగు ఎక్కువగా జరగనుందని
సమాచారం. సంగీత దర్శకుడిగా అనిరుధ్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమాను
కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు.