సురేందర్ రెడ్డి అనే పేరు భారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తూ
ఉంటుంది. అలాంటి ఆయన దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేశాడు. ఈ సినిమాతో
కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అనిల్
సుంకర నిర్మించాడు. ‘కాకినాడ’లో జరిగిన ఈ సినిమా ఈవెంటులో ట్రైలర్ ను రిలీజ్
చేశారు.విలన్ గ్యాంగ్ వేసే ఎత్తులు .. అందుకు తగిన విధంగా హీరో టీమ్ అమలు పరిచే
వ్యూహాలకి సంబంధించిన సన్నివేశాలపై .. భారీ యాక్షన్ దృశ్యాలపై ఈ ట్రైలర్ ను
కట్ చేశారు. నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఈ ట్రైలర్ ను చూస్తేనే
అర్థమైపోతోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్
ఆకట్టుకుంటోంది.

ఈ వేదికపై అనిల్ సుంకర మాట్లాడుతూ .. “ఈ సినిమా తరువాత ఎవరు ఎక్కడ ‘ఏజెంట్’
అనే మాట విన్నా, వెంటనే అఖిల్ గుర్తుకు వచ్చేలా ఈ సినిమా ఉంటుంది. సురేందర్
రెడ్డి స్టైలీష్ టేకింగ్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ఈ
సినిమాలోని ఫైట్లను 6 దేశాలలో చిత్రీకరించాము. తప్పకుండా ఈ సినిమా ప్రతి
ఒక్కరికీ నచ్చుతుంది” అని చెప్పుకొచ్చారు.