మణిరత్నం దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళనాట
భారీ చారిత్రక చిత్రంగా నిలిచింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్
చేసింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, మిగతా భాషల్లో అంతగా
ఆదరణ పొందలేకపోయింది. చోళ .. పాండ్య రాజులకు సంబంధించిన అనేక పాత్రలను
గుర్తుపెట్టుకోవడం సాధారణ ప్రేక్షకులకు కష్టమైంది.ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రేక్షకుల ముందుకు
రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల
కానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని చాలా చోట్ల ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్
బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ 200K డాలర్లకి పైగా ప్రీ సేల్స్
జరిగినట్టుగా చెబుతున్నారు.

‘పొన్నియిన్ సెల్వన్ 1’ మాదిరిగా సీక్వెల్ కి కూడా ఇతర భాషల్లో వసూళ్లు
తక్కువగా ఉంటాయని చెప్పలేం. ఎందుకంటే ఫస్టు పార్టులో చాలా సమయం పాత్రల
పరిచయానికే సరిపోయింది. విక్రమ్ – ఐశ్వర్య రాయ్ ట్రాక్ సెకండ్ పార్టులోనే
ఎక్కువగా ఉండనుంది. అందువలన సీక్వెల్ కి లభించే ఆదరణ ఎక్కువగానే ఉంటుందనే
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.