అంతకు ముందు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి రెండవ బ్లాకులోని మంత్రి చాంబరులో స్టేట్ వేర్ హౌసింగ్, సుబాబుల్, ఆయిల్ ఫెడ్ పై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఇతర ఆహార ధాన్యాల నిల్వలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాములను పూర్తిగా నింపిన తర్వాతే ప్రవేట్ గోదాముల్లో నిల్వ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు