మునుగోడు : నేటితో ఉపఎన్నిక ప్రచారం ముగుస్తున్నందున మంగళవారం సాయంత్రం 6 తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు ఉంటాయని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చినవారు నియోజకవర్గంలో ఉండకూడదని తెలిపారు. నేటి సాయంత్రం తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం చేయరాదని, గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.