హీరో గొప్ప అని వాదించుకునేవారు అయితే అదంతా ఒక్కప్పటి సంగతి. ఇప్పటి హీరోల
అభిమానులు అందరూ సోషల్ మీడియాలోనే ఫ్యాన్ వార్స్ కి దిగుతున్న సంగతి సోషల్
మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ -మెగా ఫ్యాన్స్ మధ్య మెగా
ఫ్యాన్స్ -నందమూరి ఫ్యాన్స్ మధ్య, మహేష్ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలా
రకరకాల విధాలుగా అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫ్యాన్
వార్స్ కల్చర్ ఇప్పుడు బరితెగించే విధంగా సాగుతోంది. తాజాగా పశ్చిమగోదావరి
జిల్లాలోని అత్తిలిలో ఈ ఫ్యాన్ వార్ కలకలం రేపింది. తమ అభిమాన హీరోల గురించి
ఇద్దరు పెయింటర్ల మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారితీసింది. ఏలూరుకు చెందిన
పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే ఒక వ్యక్తికి ఇంటికి పెయింట్
వేసేందుకు వచ్చారు. వారిలో పెయింటర్ హరికుమార్ ప్రభాస్ అభిమాని, దీంతో
హరికుమార్ తన వాట్సాప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియోని పెట్టుకున్నాడు. మరో
పెయింటర్ కిషోర్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమాని ఈ క్రమంలో నేను పవన్ కళ్యాణ్
అభిమానిని కదా అందుకే నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ కళ్యాణ్ వీడియో
స్టేటస్‌గా పెట్టుకోమని హరికుమార్ని కోరాడట.
దానికి హరికుమార్ ఒప్పుకోలేదు సరి కదా నేను ప్రభాస్ కి వీరాభిమానిని ప్రభాస్
వీడియోనే పెట్టుకుంటా పవన్ కళ్యాణ్ వీడియో పెట్టేది లేదని తేల్చి చెప్పడంతో
ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందట. ఆ వాగ్వాదం అర్ధరాత్రి సమయానికి మరింత ముదిరి
ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఈ క్రమంలో తన అభిమాన హీరో
వీడియో తీసేయమని బలవంతం చేసిన కిషోర్‌ని హరికుమార్ ఒక సెంట్రింగ్ కర్రతో బలంగా
కొట్టాడు.
తీవ్ర గాయాలు కావడంతో కిషోర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. కిషోర్
చనిపోయిన విషయం అర్థం అయిన వెంటనే హరికుమార్ అప్పటికప్పుడు అక్కడి నుంచి
పరారయ్యాడు. ఏదేమైనా తమ అభిమాన హీరోల కోసం ఈ విధంగా అభిమానులు ఒకరినొకరు
కొట్టుకుని చంపుకోవడం దారుణమైన విషయం అనే చెప్పాలి.