రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
277 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : పేదలందరూ సమాజంలో ఉన్నత రీతిలో బతకాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 63 వ డివిజన్ 277 వ వార్డు సచివాలయం
పరిధి సుందరయ్యనగర్లో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక
కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. 423 గడపలను సందర్శించి.. ప్రజలతో మమేకమయ్యారు. నాలుగు
సంవత్సరాల్లో తమకు ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలతో
పంచుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డినే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర
ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అన్ని వర్గాల నుంచి ఈ
ప్రభుత్వానికి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా తమ దృష్టికి
వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని.. పరిష్కారాలు వెతుకుతూ ముందుకు
సాగారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన
పర్యటనలో భాగంగా పలువురు గర్బిణీలు, బాలింతలతో మల్లాది విష్ణు మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఏవిధంగా పంపిణీ జరుగుతుందో అడిగి
తెలుసుకున్నారు. అనంతరం స్థానిక 825, 826 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన
ఆయన అక్కడి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సంపూర్ణ
పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు,
చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించడంతో పాటు.. ఆరోగ్య సూత్రాలను
తెలియపరచాలని సిబ్బందికి సూచించారు. అలాగే రక్తహీనత ఉన్న పిల్లలపై ప్రత్యేక
శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. అనంతరం మల్లాది
విష్ణు మీడియాతో మాట్లాడారు.
పబ్లిక్ పల్స్ ను ప్రతిబింబించిన టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమని మల్లాది విష్ణు
అన్నారు. టైమ్స్ నౌ – ఈటీజీ నిర్వహించిన సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం
చేసిందని తెలిపారు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. 24 నుంచి 25 స్థానాలలో ఘన
విజయం ఖాయమని సర్వే తేల్చిందన్నారు. రాష్ట్ర ప్రజలు నెంబర్ వన్ ఛాయిస్ గా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పేదలకు
సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, స్వచ్ఛమైన పారదర్శక పాలన.. మరో
30 ఏళ్లు ఆయనను ప్రజల హృదయాలలో ముఖ్యమంత్రిగా నిలబెడతాయని మల్లాది విష్ణు
స్పష్టం చేశారు. ప్రజాదరణలో వైఎస్ జగన్ కు మరెవరూ సాటిలేరని.. ఇకనైనా
చంద్రబాబు, నారా లోకేష్ లు బురదజల్లే విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
సుధీర్ఘంగా సాగిన డివిజన్ పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాలు మరువలేనివని
మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు
తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ అరుణ్ కుమార్,
ఆర్ఐ(రెవెన్యూ) ప్రసాద్, ఆర్ఐ(పౌర సరఫరాలు) సరత్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు,
సీడీఓ జగదీశ్వరి, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, నాగు, టెక్యం కృష్ణ,
అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.