అఖిల్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఏజెంట్’ రెడీ
అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన
ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అఖిల్ మాట్లాడుతూ .. “నేను షాపింగ్
మాల్ పై నుంచి దూకడం గురించి అంతా అడుగుతున్నారు. అంత రిస్క్ అవసరమా
అంటున్నారు.

“కానీ నేను ఒక యంగ్ హీరోను .. చేసింది యాక్షన్ సినిమా. అందువలన నా నుంచి
ఇలాంటి ఫీట్లు అభిమానులు కోరుకుంటారు. నేను కూడా నా కెరియర్ కోసం ఎంత కష్టమైనా
పడతాను .. నా ఫ్యాన్స్ ను ఆనందింపజేయడం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాననే విషయం
అందరికీ తెలియాలి. అందువల్లనే నేను ఆ ఫీట్ చేయడం జరిగింది” అని అన్నాడు.
“మిగతా హీరోలు చేసినవే చేయడానికి అఖిల్ ఎందుకు? అని మా ఫాదర్ నాతో అంటూ
ఉంటారు. నాకు కూడా అది నిజమే కదా అనిపించింది. అందువల్లనే కొత్త జోనర్స్ తో
ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా చేసిన సినిమానే ‘ఏజెంట్’. నా
కెరియర్ ఆరంభంలోనే నాపై అంచనాలు ఎక్కువగా ఉండేవి. వాటిని అందుకోవడం కోసం నా
ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.