ఆ ఐదు చోట్ల ఎం ఈ ఎస్ గట్టి పోటీ.. బెళగావిపై పట్టు ఎవరిదో?
బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్
హోరాహోరీ తలపడుతున్నాయి. ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాలతో ఓటర్లను
ఆకర్షించేందుకు కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రతో సరిహద్దు జిల్లా
అయిన బెళగావిపై ప్రత్యేక దృష్టిసారించాయి. లింగాయత్‌లకు పట్టున్న జిల్లా కావడం
వల్ల మెజార్టీ స్థానాలపై బీజేపీ విశ్వాసంతో ఉండగా గట్టి పోటీ ఇచ్చేందుకు
కాంగ్రెస్ సైతం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
పాత మైసూరులో ఎవరిది పైచేయి
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఓల్డ్ మైసూరు ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంది.
ఇక్కడి నుంచే ఎక్కువ మంది ముఖ్య మంత్రులు ఎన్నికయ్యారు. దీంతో పాటు చాలా మంది
రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
ఈ ప్రాంతంతో కలిపి మైసూరు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత మైసూరు
మహారాజులు ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి పునాది వేశారు.
లింగాయత ఓట్ల కోసం కుస్తీ
కర్ణాటక ఎన్నికలకు, లింగాయత సామాజిక వర్గానికి అవినాభావ సంబంధం ఉంటుంది.
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల తర్వాత అత్యధిక జనాభా ఉన్న లింగాయత ఓట్లు
రాబట్టుకునేందుకు పార్టీలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం అధికార
పార్టీపై వ్యతిరేకత, అవినీతి, రిజర్వేషన్ల సవరణలతోపాటు ‘లింగాయత సీఎం’
అభ్యర్థి అంశం.. ఎన్నికలను ప్రభావితం చేసే జాబితాలో చేరింది. ఇదే అంశంపై
పార్టీలు రసవత్తర రాజకీయాన్ని ప్రారంభించాయి. ఇటీవల ముగిసిన టికెట్ల
కేటాయింపుల్లోనూ అన్ని పార్టీలు లింగాయత అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు ఇచ్చాయి.