టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్ లో వచ్చిన పుష్ప1
ఘన విజయం సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ ను ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్టార్ ను
చేసింది. దాంతో, పుష్ప2పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై తెలుగు
వారు మాత్రమే కాకుండా బాలీవుడ్ అభిమానులు సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
దానికి తగ్గట్టుగానే తనదైన శైలిలో సుకుమార్ రెండో పార్టును
తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక
సెట్ లో శరవేగంగా జరుగుతోంది. బన్నీ సహా ప్రధాన పాత్రధారులపై ఇందులో కీలక
సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.కాగా, ఈ సెట్ లో తారక్ ప్రత్యక్షం అయ్యారు. బుధవారం జూనియర్ ఎన్టీఆర్ సెట్
లోకి వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు
నెట్ లో వైరల్ అవుతోంది. ఫార్మల్ డ్రెస్ లో వున్న ఎన్టీఆర్ లోపలికి నడుచుకుంటూ
వెళ్లడం కనిపించింది. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా
చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. కాస్త గ్యాప్
లభించడంతో తారక్ .. పుష్ప సెట్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తన
స్నేహితుడైన బన్నీని కలిసి సర్ ప్రైజ్ ఇవ్వడానికే తారక్ వచ్చారా? లేక పుష్ప
సినిమాలో ఆయన ఏదైనా గెస్ట్ రోల్ చేస్తున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే
చర్చ మొదలైంది.