టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. బ్రిస్బేన్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఆటగాడు లోర్కాన్ టక్కర్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఓవర్లో తొలి వికెట్ పడిన తర్వాత టక్కర్ చివరి వరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మన్ నిలబడలేకపోయాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా గ్రూప్ 1లో 5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. గ్రూప్ 1లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది.