భారత గడ్డపై ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపుకు
వచ్చేసింది. ఈ సంవత్సరం అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చిన జట్లలో చెన్నై సూపర్
కింగ్స్ ఒకటి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై
దూసుకుపోతోంది. ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌లల్లో 5 విజయాలను సాధించింది.
వర్షం వల్ల లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ రద్దయింది.
దాంతో మొత్తం 11 పాయింట్లతో ప్రస్తుతం ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మూడో
స్థానంలో నిలిచింది. మరో రెండు విజయాలు సాదించినా చెన్నై ప్లే ఆఫ్స్ వెళ్లే
అవకాశాలు ఉంటాయి.ఐపీఎల్ మొత్తంలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ముందువరుసలో
ఉన్నాడు. తాను సారథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సెకెండ్
మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా నిలిపాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
సారథ్యం వహిస్తోన్న ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలవగా.. చెన్నై ఖాతాలో 4
ఉన్నాయి. కేవలం చెన్నైని మాత్రమే కాదు టీమిండియాను కూడా విజయ పథంలో నడిపించాడు
ఎంఎస్ ధోనీ. మంచి ట్రాక్ రికార్డు ఉన్న ధోనీ.. టీమిండియా హెడ్ కోచ్‌గా రావాలని
అందరూ అభిప్రాయపడుతున్నారు. టీమిండియా హెడ్ కోచ్‌గా అతడిని నియమించే అవకాశాలను
బీసీసీఐ పరిశీలిస్తోందనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐపీఎల్ నుంచి కూడా
రిటైర్ అయిన తరువాత ధోనీకి ఈ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని మాజీలు
అంటున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా హింట్
ఇచ్చాడు.