న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్‌ను తిరస్కరించింది.