గుంటూరు : ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడితే నవంబర్ ఒకటోతేదీన నిర్వహించాల్సిన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చంద్రబాబు విస్మరించి, నవ నిర్మాణం అంటూ డ్రామాలాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పొట్టిశ్రీరాములు చేసిన త్యాగాలను తెలుగుజాతి గుర్తు పెట్టుకునేవిధంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఏటా నవంబర్ ఒకటో తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారని వివరించారు. అమరజీవి ఆశయాలను,లక్ష్యాలను నెరవేర్చేదిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, ప్రభుత్వ మార్కెటింగ్, సహకార సలహాదారుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.