అదరగొట్టిన ఇషిత, గరిమ, ఉమ, స్మృతి
న్యూఢిల్లీ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన
సివిల్స్ 2022 తుది ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. తొలి నాలుగు
ర్యాంకుల్లో ఇషితా కిశోర్, గరిమా లోహియా, ఉమా హారతి, ఎన్. స్మృతి మిశ్రా
మెరిశారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన
సివిల్స్-2022 తుది ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గతేడాది మాదిరిగానే
ఈసారి కూడా టాప్ ర్యాంకర్లుగా అమ్మాయిలే సత్తా చాటారు. తొలి నాలుగు
ర్యాంకులను వారే సాధించారు. ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు
సాధించగా.. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు,
నాలుగు ర్యాంకులతో మెరిశారు.