అతి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్
1000కిపైగా పోస్టుల భర్తీ
అమరావతి : గ్రూప్-1. గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్
జారీకి సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్న్ ఇచ్చారు. గురువారం
ముఖ్యమంత్రికి అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల
మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు.
ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని
వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.
గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి
సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని
తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం
ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా
దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.