బేతంచెర్లలో రూ.1.2 కోట్లతో జగనన్న కాలనీకి రోడ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించిన
ఆర్థిక మంత్రి
నంద్యాల : బేతంచెర్లలో నేషనల్ హైవేకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హనుమంతరాయుని
కొట్టాలలో 53కి.మీ నేషనల్ హైవే-340బీకి శుక్రవారం భూమి పూజ నిర్వహించి
మంత్రి బుగ్గన శ్రీకారం చుట్టారు. రూ.630 కోట్ల అంచనాతో ఓర్వకల్ మండలం
సోమయాజుల పల్లె నుంచి బేతంచెరంల మీదుగా డోన్ వరకూ జాతీయ రహదారి నిర్మాణం
జరగనుందని మంత్రి వెల్లడించారు. భూమి పూజకు ముందు హనుమంతరాయుని కొట్టాల
రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యేక పూజ
నిర్వహించారు. మంత్రి సొంత నియోజకవర్గం డోన్ వ్యాప్తంగా ఇప్పటికే రహదారులతో
కళకళలాడుతున్న తరుణంలో ఈ జాతీయ రహదారి నిర్మాణం బేతంచెర్లకు మణిహారం కానుందని
స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ బేతంచెర్ల పట్టణంలోని జగనన్న కాలనీకి పూర్తయిన కీలకమైన రోడ్ కమ్
బ్రిడ్జిని కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. రూ.1.2 కోట్లు ఖర్చు పెట్టి ఈ
బ్రిడ్జిని కట్టినట్ల మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల
జిల్లా కలెక్టర్ మనజీర్ జీలానీ సమూన్, బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ చలం
రెడ్డి,ఎంపీపీ నాగభూషణం, జెడ్పీటీసీ శివలక్ష