అమరావతి : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం), జాతీయ దంత ఆరోగ్య కార్యక్రమం
(ఎన్ఓ హెచ్ పి)లో భాగంగా విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఆస్పత్రికి చెందిన
సంచార దంత వైద్య వాహనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
శుక్రవారం మంగళగిరి ఎపిఐఐసి భవనం ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సంచార దంతవైద్య
వాహనంలో దంత సమస్యలకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, ఫిల్లింగ్లు, పళ్ళు
తీయటం వంటి ప్రాథమిక దంత వైద్య సేవలను అందచేస్తారని విజయవాడ ప్రభుత్వ దంత
వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ఈ సంచార దంత
వైద్య వాహనం ద్వారా సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు,
పాఠశాలల్లో సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య
ఆరోగ్యశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ
శాఖ కమీషనర్, ఎన్ హెచ్ఎం మిషన్ డైరెక్టర్ జె నివాస్, స్టేట్ ప్రోగ్రాం
మేనేజర్ డాక్టర్ వెంకట రవి కిరణ్, నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం స్టేట్ నోడల్
ఆఫీసర్ డాక్టర్ ఇ ప్రశాంత్, స్టేట్ ఓరల్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్
సౌజన్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.