విజయవాడ : బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) మానవ హక్కుల కమిటీ ” కో – కన్వీనర్
” గా భవానీపురం, హెచ్.బి కాలని కి చెందిన న్యాయవాది వి.ఎన్. రాజు
నియమితులయ్యారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రాజు మాట్లాడుతూ, మానవులందరికీ కులం,
మతం,జాతి,భాష,ప్రాంతం,లింగ బేధాలు లేకుండా కొన్ని మౌలిక హక్కులు ఉంటాయని,
ప్రతి వ్యక్తి తన పరిస్థితులతో సంబంధం లేకండా సమాజంలో ఒక సభ్యుడిగా అనుభవించే
కనీస హక్కులనే మానవ హక్కులు అంటారని తెలిపారు. స్వేచ్ఛ గా, హుందాగా జీవించే
హక్కు, బానిసత్వం, హింస నుండి స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, విద్య హక్కు
లాంటి మరెన్నో హక్కులు ఉన్నాయని, ఎక్కడైనా సరే మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే
వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగే లా తన వంతు కృషి చేస్తానని అన్నారు.
తన మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన బీబీఏ ప్రెసిడెంట్ కె.బి.సుందర్,
జనరల్ సెక్రటరీ జన్ను శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ పుప్పాల శ్రీనివాస్,
కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.