గిరిజనులపై బిజెపిది కపట ప్రేమ
బిజెపి గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలి
ప్రపంచవ్యాప్తంగా ఎస్టీలు మాట్లాడి గోర్ మాటి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలి.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన గురుకులాలు, బంజారా భవన్ ఏర్పాటు
చేసుకుంటున్నాం.
గిరిజన అభివృద్ధి కోసం అన్ని పార్టీల్లో ఉన్న నేతలు కృషి చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన పార్లమెంటు స్థలం బంజారా బిడ్డది.
హైదరాబాదులో ఎంతో ప్రతిష్టాత్మకంగా బంజారా భవన్ ను ఏర్పాటు చేసుకున్నాం.
ఢిల్లీలో కూడా సేవాలాల్ భవన్ నిర్మాణం చేయాలి.
సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరిపించాలి.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి చెందినట్లు దేశవ్యాప్తంగా అభివృద్ధి
జరగాలి.
వచ్చే నెలలో పోడు భూములు పట్టాలు అందిస్తున్నాం.
మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని, మేలు చేసిన
సీఎం కేసీఆర్‌ను గిరిజన జాతి మరువబోధని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ
శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు. తెలంగాణలో 3,144 తండాలను గ్రామ
పంచాయతీలుగా చేయడంతో పాటు, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన
ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల అమలుతో
విద్య ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. వీటితో పాటు మెడికల్,
ఇంజినీరింగ్ సీట్లు అదనంగా వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు
10శాతం రిజర్వేషన్ పెంచడానికి ఎందుకు జాప్యం చేస్తున్నదని ప్రశ్నించారు.
గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే తెలంగాణ మాదిరిగా వెంటనే దేశంలో 10శాతం
రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి తండాకు గుడి కట్టిస్తామని
చెబుతున్న బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ కట్టించిన మాదిరి
ఢిల్లీలో బంజారా భవన్‌ను నిర్మించి, సేవాలాల్ జయంత్యుత్సవాలను దేశ వ్యాప్తంగా
అధికారికంగా నిర్వహించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. దేశంలో 14కోట్ల మంది
గిరిజనులు మాట్లాడుతున్న లంబాడి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి అధికారిక
భాషగా కేంద్రం గుర్తించాలన్నారు. గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించి తన చిత్తశుద్ధిని
చాటుకోవాలని అన్నారు. గిరిజనులపై బిజెపిది కపట ప్రేమ అని సత్యవతి రాథోడ్
మండిపడ్డారు. బిజెపి గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలని మంత్రి సవాల్
విసిరారు. ఈ సమావేశంలో ట్రై కార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్
వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, అఖిలభారత బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ
ప్రెసిడెంట్ సింపల్ బాయ్ రాథోడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్
ప్రొఫెసర్ డా. బి. రమణ నాయక్ ,కో-ఛైర్మన్ రాంబాల్ నాయక్, కో-ఆర్డినేటర్లు,
డా.ఎం. ధనంజయ్ నాయక్, కో-ఆర్డినేటర్ శ్రీ రాంబాబు నాయక్ , రూపసింగ్ ధరావత్
అభిమాన్ గాంధీ నాయక్ , జి. తిరుపతి నాయక్ , డా. రవితేజ తదితరులు పాల్గొన్నారు.