విజయవాడ : విజయవాడలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ
చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ
వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ, ఏపీ మీడియా
అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, కొడాలి నాని, పేర్నినాని
హాజరయ్యారు. ఈ సందర్బంగా కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్
ప్రభుత్వం పడిపోయిన రోజు తన కళ్ల వెంట నీరొచ్చిందని అప్పటి విషయాలను
గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్కు జరిగి అవమానాలను తాను ప్రత్యక్షంగా
చూసినట్లు చెప్పుకొచ్చారు. చివరికి కొడుకులు కూడా ఆయన్ను అవమానించారని
తెలిపారు. ఎన్టీఆర్, జగన్ పరిపాలనలో చాలా పోలికలున్నాయన్న ఆయన పరిపాలన
పారదర్శకత, సౌలభ్యం కోసం ఎన్టీఆర్ మండల వ్యవస్థను తెస్తే జగన్ సచివాలయ
వ్యవస్థ తెచ్చారని చెప్పారు.