దాసన్నను మర్యాదపూర్వకంగా కలిసిన దువ్వాడ వాణి
పోలాకి : టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమితులైన దువ్వాడ వాణి తన
అనుచరగణంతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ను మబగాంలో
మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి, నియామకాన్ని బలపరిచి,
ప్రోత్సాహాన్నిచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కు రుణపడి
ఉంటామని ఆమె ఈ సందర్భంగా పేర్కొంటూ దాసన్నను శాలువతో సత్కరించారు. అంతా మంచే
జరుగుతుందని, టెక్కలిలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరాల్సిందేనని కృష్ణ దాస్ ఈ
సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు మెండుగా
ఉన్నాయని, ఈసారి టెక్కలి నియోజకవర్గం నేతలు కూడా సమన్వయంతో ఉన్నారని, ఎలాంటి
లోటుపాట్లకు, పొరపాట్లకు తావివ్వకుండా పనిచేయాలని, మంచి ఫలితం దక్కుతుందని ఈ
సందర్భంగా కృష్ణ దాస్ ఆకాంక్షించారు.