కొవ్వూరు : ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం
ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అవుతున్న శుభ సందర్భంలో అధికార పార్టీ నాయకులు,
కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ
సందర్భంగా ఆదివారం సాయంత్రం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో నాయకులకు,
కార్యకర్తలకు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి
వనిత దిశా నిర్ధేశనం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం 4
గంటలకు ఐ.పంగిడి నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై కాపవరం జంక్షన్, ధర్మవరం,
పెనకనమెట్ట, దొమ్మేరు, కొవ్వూరు టౌన్ లో 1, 2, 3 వార్డులు, మెరకవీధి, విజయ
విహార్ సెంటర్, ఎల్ఐసీ మెస్, డీఎస్సీ ఆఫీస్, క్యాంపు మీదుగా ఉంటుందని రూట్
మ్యాప్ ను వివరించారు. యువకులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ
విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంచార్జ్ లు,
ముఖ్య నాయకులకు టీంలు వారీగా విభజించి బాధ్యతలు అప్పగించారు. కొవ్వూరు
ముఖ్యమంత్రి పర్యటన ఎంతటి ఘనవిజయం సాధించిందో, అలాగే ఈ కార్యక్రమం కూడా విజయం
సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యత పనిచేయాలని సూచించారు. బైక్ ర్యాలీలో ఎక్కడా
అపశృతి దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి
నాలుగేళ్ల పూర్తైన సందర్భంలో సభ నిర్వహిస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ
కార్యక్రమంలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు రాజీవ్
కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున
పాల్గొన్నారు.

శిలువను ప్రతిష్టించిన హోంమంత్రి తానేటి వనిత : మానవాళిని పాపాల నుంచి
విముక్తం చేయడానికి ఏసు క్రీస్తు శిలువ ఎక్కాడని, అటువంటి శిలువ ప్రతిష్ట తమ
చేతుల మీదుగా జరగడం చాలా ఆనందదాయమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఆదివారం కొవ్వూరు టౌన్ 3వ వార్డు సెంట్
పాల్ లూథరన్ చర్చి నందు జరిగిన శిలువ ప్రతిష్ట కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు. చర్చి నిర్వాహకులు హోంమంత్రికి శాలువాతో సన్మానించి
ప్రత్యేక ప్రార్థనలు చేశారు.