లబ్ధి
అంతర్జాతీయ బుుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న
హోంమంత్రి
కొవ్వూరు : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తల్లి కడుపులోని బిడ్డ నుండి
వృద్ధురాలి వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందని రాష్ట్ర
హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ బుతుస్రావ
పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పట్టణంలోని 14వ వార్డు బ్రిడ్జి పేట
నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన
కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళ జీవితంలో బుుతుక్రమం
సహజ ప్రక్రియని, అపోహలను వీడి బుతుస్రావం సమయంలో మహిళలు వరిశుభ్రతను
పాటించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ
ఇల్లు, పరిసరాల శుభ్రతపై అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కుటుంబం బాగుంటే
పరిసరాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రమంతా పరిశుభ్రంగా ఉంటుందన్నారు.
అపరిశుభ్రతతో అనారోగ్య సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.
భవిష్యత్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా బుుతుక్రమం సమయంలో తగిన జాగ్రత్తలు
పాటించేలా ఇంటింటా ప్రచారం చేపట్టాలన్నారు. . మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం,
పరిశుభ్రతే ధ్యేయంగా ‘స్వేచ్ఛ’కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. బుుతుక్రమ
సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా
శానిటరీ న్యాప్కిన్లు అందజేస్తున్నామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే
పౌష్టికాహారం అవసరమని.. గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఇచ్చే
పౌష్టికాహారాన్ని క్వాలిటీని, క్వాంటిటీని పెంచి పుట్టబోయే బిడ్డలు సైతం
ఆరోగ్యవంతంగా పుట్టాలని ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ చర్యల కారణంగా
రాష్ట్రంలో మాత, శిశు మరణాలను తగ్గించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతీ
మహిళను వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు
చేపట్టిందని హోంమంత్రి తెలిపారు. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలకు
అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. నాలుగేళ్ల పరిపాలనా కాలంలో రెండేళ్లు కరోనాతో
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాఎక్కడా సంక్షేమం ఆగకుండా నేరుగా
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ఇలాంటి
కార్యక్రమాలు చేయటం లేదని సీఎం చెప్పారు. బ్యాంకులకు నగదు కట్టలేక ఇబ్బందులు
పడుతున్న మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. ఆడపడుచులకు
పుట్టింటి కానుకగా 31 లక్షల మందికి ఇల్లు పట్టాలు మహిళల పేరుమీదనే
ఇచ్చామన్నారు. ప్రతీ మహిళ మొబైల్లోకి దిశ యాప్ డౌన్లోడ్ చేయించామన్నారు.
ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు వచ్చినా కూడా ఎస్ఓఎస్ నొక్కి పోలీసుల
సహాయంతో మిమ్మల్ని మీరు రక్షించుకోండని ఒక భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. విద్య,
వైద్య రంగంలో ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఏపీని
ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాలు పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలు
ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
పాలన అందిస్తున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి
గైనకాలజిస్ట్ డాక్టర్లతో మహిళలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ
కార్యక్రమంలో గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా, వార్డు
కౌన్సిలర్లు అరుణ, అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, ప్రతివాడ నాగమణి, నాయకులు
నగళ్లపాటి శ్రీను, మెప్మా తూ.గో. జిల్లా అధికారి శ్రీదేవి తదితరులు
పాల్గొన్నారు.