నాలుగు గోడల మధ్య ఏకాంతంగా భేటీ
భేటీ ముగిసిన తర్వాత అత్యవసర ఆరోగ్య పరిస్థితి
వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స అందిస్తున్న వైద్యులు
అనుకోని ఘటన ఒకటి జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో బెలారస్
అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాస్కో లో భేటీ కాగా.. ఆ తర్వాత కొంత
సమయానికే ఆందోళనకర పరిణామం చోటు చేసుకుంది. లుకషెంకోకు తీవ్ర గుండె పోటు
వచ్చింది. వెంటనే ఆయన్ను మాస్కోలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన
పరిస్థితి విషమంగా ఉంది. లుక షెంకో (68) పుతిన్ తో నాలుగు గంటలపాటు భేటీ
తర్వాత ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. బెలారస్ ప్రతిపక్ష నేత వాలెరీ
టెప్ కాలో సైతం దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్ష కార్యాలయం
పాత్ర ఉండొచ్చన్న సందేశాలు కూడా వినిపిస్తున్నాయి. లుంక షెంకో ఆరోగ్యం కొన్ని
రోజులుగా సమస్యల్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రక్త శుద్ధి తదితర
చికిత్సలు చేయిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో
ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈ నెల మొదట్లో లుక షెంకో ఓ ట్వీట్ చేశారు. నేనేమీ
మరణించడం లేదు ఫ్రెండ్స్. నాతో చాలా కాలం పాటు వేగాల్సి ఉంటుందని ట్వీట్ చేయడం
గమనార్హం