అమ్మఒడి పథకాన్ని కూడా కాపీ కొట్టారు
బాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర చంద్రబాబుకు లేదు
ధ్వజమెత్తిన మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి : పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు రాష్ట్రంలోని
పేదలందర్నీ ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ
మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు
బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా
చేసారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో నాగార్జున
మాట్లాడుతూ, రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని
విమర్శించారు. అమ్మకు వందనం అనే పేరుతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అమలు
చేస్తున్న అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారని దుయ్యబట్టారు. పేదలకు ఒక సెంటు
భూమి ఇస్తే ఓర్చుకోలేనివాడు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు
చెప్పిస్తామంటే సహించలేని వాడు..పేదలకు మేలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని
కోర్టుకు వెళ్లి అడ్డుకొనేవాడు చంద్రబాబు అని, అలాంటి చంద్రబాబు ఇవాళ తనను
గెలిపిస్తే రాష్ట్రంలోని పేదలందరినీ ధనవంతులను చేస్తానని చెబితే నమ్మడానికి
ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన
75 ఏళ్ల వయసులో, రాజకీయ జీవన సంధ్యలో గుర్తొచ్చిందా అని నిలదీసారు. పేదల్ని
ధనకులను చేసిన చరిత్ర చంద్రబాబుకు ఏనాడూ లేదని, కానీ పేదరికం నుంచి
బయటపడుతున్న అక్కచెల్లెమ్మల్నీ, రైతుల్నీ రుణమాఫీ పేరిట ఇచ్చిన వాగ్దానంతో
2014-19 మధ్య వారిని మరింత నిరుపేదలుగా మార్చి, అప్పుల పాలు చేసి, వారి బంగారం
కూడా వేలం వేసే పరిస్థితి రావడానికి, రైతుల ఆకలి చావులకు చంద్రబాబు దొంగ
వాగ్దానాలే కారణం అని నాగార్జున ఘాటుగా విమర్శించారు. 2014 ఎన్నికలలో
చంద్రబాబు తన మేనిఫెస్టో లో ఇచ్చిన 650 హామీలలో కనీసం 10శాతం హామీలను కూడా
నెరవేర్చలేదని నాగార్జున విమర్శించారు. చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టో ను 10
నిమిషాలు మాత్రమే వెబ్ సైట్ లో పెట్టి ఆ తర్వాత దాన్ని కనబడకుండా మాయం
చేసారని, ప్రజలకు గతం ఏదీ గుర్తు ఉండదనేది చంద్రబాబు ఫిలాసఫీ అని చెప్పారు.
అందుకే తాను కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు, సరికొత్త వాగ్దానాలు చేయడం,
నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మూడుసార్లు
ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడు కూడా తాను ప్రకటించిన మ్యానిఫెస్టోను
అమలు చేయలేదని అందుకే ఆయన ప్రకటించిన మేనిఫెస్టో కు కూడా ఎలాంటి విలువ లేదని
నాగార్జున పేర్కొన్నారు. ప్రజలు ఆ మేనిఫెస్టో ను నమ్మరని స్పష్టం చేసారు.
ఎన్టీ రామారావు పేరు చెబితే 2 రుపాయలకే కిలో బియ్యం పథకం, వైయస్ రాజశేఖర్
రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ పథకాలు గుర్తొస్తాయని, అలాగే సీఎం జగన్మోహన్
రెడ్డి పేరు చెబితే ఇంకా ఎన్నో పథకాలు గుర్తొస్తాయని తెలిపారు. అయితే 14 ఏళ్ల
పాటు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే అలాంటి ఏ పథకమూ గుర్తుకు
రాదని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే జనాన్ని దోచుకుతిన్న జన్మభూమి కమిటీలు
గుర్తుకువస్తాయని నాగార్జున ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం మేనిఫెస్టో లో ఇచ్చిన
హామీల్లో 98.2శాతం నెరవేర్చిందని గుర్తు చేసారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల
ద్వారా 2.82 లక్షల కోట్ల రుపాయలను ప్రజలకు అందించినా ఎక్కడా ఒక్క పైసా కూడా
అవినీతి జరగకుండా అన్ని పథకాలను అందించగలగడమే తమకు ప్రజల నుంచి పెద్ద
ఆశీస్సులని నాగార్జున చెప్పారు. చంద్రబాబు వదిలేసి పారిపోయిన టిడ్కో ఇళ్లకు
అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఒక
ప్రశ్నకు బదులుగా వివరించారు.