అధ్యక్షులు బండి శ్రీనివాసరావు
గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖలో పనిచేయుచున్న మంది. 112
పరిపాలనాధికారులకు,93 మంది పంచాయతీ రాజ్ గ్రామీణాభివ్రుద్ధి విస్తరణాధికారులకు
మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్
ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్ ధన్యవాదాలు
తెలిపారు. న్యాయ పరమైన ఇబ్బందులు కారణంగా గత 6 నెలలుగా అపరిస్క్రుతముగా వున్న
పదోన్నతుల సమస్యను పరిష్కరించి పంచాయతీ రాజ్ శాఖలో ఎంతో కాలంగా ఖాళీగా వున్న
మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పోస్టులను ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయటం శుభ
పరిణామమని అయన అన్నారు. ఇందువలన పరిపాలన పరమైన ఇబ్బందులు తొలగి పోవుటమే
కాకుండా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు లభించాయని అయన
అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పోస్టులను క్రింది కేడర్ల నుండి
ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయటం వలన రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖలో
పనిచేయుచున్న వేయి మందికి పైగా సినియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్,
పంచాయతీ కార్యదర్శులు మరియు రికార్డ్ అసిస్టెంట్లు తదుపరి కేడర్లకు పదోన్నతులు
పొందుతారని అయన పేర్కొన్నారు. ఎంతో పారదర్శకంగా, త్వరితగతిన పదోన్నతులు
కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖామంత్రి బూడి ముత్యాల
నాయుడు కి, పంచాయతీ రాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ కి పంచాయతీ రాజ్
కమిషనర్ సూర్యకుమారి కి పంచాయతీ రాజ్ ఉద్యోగుల తరపున అయన ధన్యవాదాలు తెలిపారు.