హైదరాబాద్ : అనుహ్యంగా మలుపులు తిరుగుతు వాయిదాలు పడుతు వస్తున్న కడప ఎంపీ
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు ఈ రోజు వెలువనుంది. ఈ కేసు
తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగా సీబీఐ అవినాష్‌కు బెయిల్ ఇవ్వందంటూ
వాదనలు వినిపించింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ
హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికి కన్నా ముందే సీఎం జగన్‌కు
వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని.. అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా అనే
అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు
వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని
అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏప్రిల్ 17 నుంచి అనేక మలుపులు తిరిగిన ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్
పిటిషన్‌పై నేడు తేలిపోనుంది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ తండ్రి వైఎస్
భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అరెస్టు చేసి ఆ తర్వాతి రోజున అవినాష్
రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీంతో గత నెల 17న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్
కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఎదుట రోజూ విచారణకు హాజరు
కావాలని, దర్యాప్తులో ప్రశ్నలు, సమాధానాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న
న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఏప్రిల్ 25 విచారణ జరుపుతామని అప్పటి వరకు
అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర
ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ
జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం తెలంగాణ
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టేసింది.