ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యధోరణి అవలంబిస్తే ఈనెల
10 న తరువాత ఆందోళనలు ఉదృతం చేస్తాం
ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున ఫిభ్రవరి 13 సియస్ కు ఇచ్చిన 50 పేజీల
మెమోరాండపై సియస్ క్యాంపు కార్యాలయంలో చర్చలు
ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్
పలిశెట్టి దామోదరరావు
గుంటూరు : ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ సాధనకోసం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు
సృష్టిస్తున్నాసరే నేటికి 84 రోజులు గా చేస్తున్న గాంధేయవాదంలో చేస్తున్న
పోరటాలు కనిపించకపోతే జూన్ 10 రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి భవిష్యత్
కార్యక్రమాలన్ని ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాలతో కలసి తప్పని
సరిపరిస్దితులలో ప్రత్యక్ష కార్యాచరణలకు పూనుకోక తప్పదని దానికి ప్రభుత్వమే
బాధ్యత వహించాల్సి వస్తుందని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసి యేట్ చైర్మన్
టి.వి.ఫణిపేర్రాజు, గుంటూరూ జిల్లా జెఏసి చైర్మన్ కనపర్తి సంగీతరావు
తెలిపారు. బుధవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులందరి సమక్షంలో
జూన్ 8 న గుంటూరు లో ఏపిజెఏసి అమరావతి ఆధ్వర్యంలో చేపట్టదలచిన నాలుగవ ప్రాంతీయ
సదస్సును జయప్రదం చేయాలని నినాదాలు ఇస్తూ పోస్టర్ ను, కరపత్రాలను రిలీజ్
చేసారు. ఈ పోస్టర్ రిలీజ్ సందర్బంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా తో
మాట్లాడుతూ ఈ 84 రోజుల ఉద్యమంవలన ఉద్యోగుల రావల్సిన బకాయిలలో సూమారు రూ.6000
కోట్లు సాదించుకున్నాం,కారుణ్య నియామాకాలు సాధించుకున్నాం. ఆర్టీసి ఉద్యోగుల
సమస్యలు కొన్ని పరిష్కరించుకున్నాం. కొత్తజిల్లాలు హెచ్.ఆర్.ఏ లు పెంపుదల,
కొంతమందికి టిఏలు,కొన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు ఎర్నిలీవ్ లడబ్బులు
పడుతున్నాయి,సిపియస్ ఉద్యోగులకు సంబందించి ప్రభుత్వం వాడుకున్న డబ్బులు రూ.
2400 కోట్లు ఇప్పించుకోగలిగాం. ఇదంతా ఈ 84 రోజుల ఉద్యమ ఫలితంగానే
సాధించుకోగలిగామని ఆయన తెలిపారు. ఇంకా ఉద్యోగులకు రావల్సిన వాటిలో పిఆర్సీ,
డిఏ బకాయిలు, పెండింగు డిఏలలో ఒకటి ప్రకటించినప్పటికీ ఇంకా రెండు డిఏలు
రావల్సి ఉందని అలాగే వీటితో పాటు రెవిన్యూ, ఆర్టీసి, మున్సిపల్, గ్రామ,వార్డు
సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్శింగ్ ఉద్యోగుల సమస్యలు ఇంకా వివిధ
డిపార్టు ఉద్యోగులకు సంబందించిన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని
ఏదిఏమైనప్పటికీ సియస్ కి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో సమస్యలు పరిష్కరపై
స్పష్టత ఇచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని సెక్రటరీ జెనరల్ పలిశెట్టి
దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు తెలిపారు. ఈకార్యక్రమంలో
ఏపిజేఏసి అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ కనపర్తి సంగీత రావు, స్టేట్ క్లాస్ 4
ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు, రిటైర్డు ఎంప్లాయిస్
అసోషియేషన్ నాయకులు సిహెచ్. వెంకటేశ్వర్లు, ఏపి విఆర్ఓ అసోషియేషన్ రాష్ట్ర
కార్యదర్శి జి.అనుపమ, మున్సిపల్ కాంట్రాక్టు అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు
మధు తో పాటు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏపిజేేఏసి అమరావతి నాయకత్వంతో సియస్ సమావేశం
ఫిభ్రవరి 13 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక,
రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్శింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
ఇచ్చిన 50 పేజీలతో 51 డిమాండ్లుపై ఇచ్చిన మెమోరాండపై సియస్ క్యాంపు
కార్యాలయంలో గురువారం ఉదయం 11-30 లకు చర్చలు ఉన్నాయని బొప్పరాజు,పలిశెట్టి
దామోదరరావు తెలిపారు.