సజ్జల రామ కృష్ణా రెడ్డి ని కలిసిన కోనసీమ జేఏసీ కార్యవర్గం
అమరావతి : తాడేపల్లి నందు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల
రామకృష్ణారెడ్డి ని కోనసీమ జేఏసీ కార్యవర్గం కలిసింది. కోనసీమ రైల్వే లైన్ కు
రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇప్పించాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వ ముఖ్య సలహాదారు
శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ నిధుల విడుదలకు తగు
చర్యలు తీసుకుంటామని తెలిపారు. సజ్జల రామ కృష్ణా రెడ్డిని కలిసిన వారి లో
కోనసీమ జేఏసీ చైర్మన్ వి.ఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు, కో
కన్వీనర్లు మంత్రి ప్రగడ వేణుగోపాల్, డాక్టర్ మంగళంపల్లి అరుణ్ కుమార్,
డాక్టర్ మధుర నరసింహమూర్తి, తదితరులు ఉన్నారు.