ప్రకాశం జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి
అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌నేత బాలినేని
శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న
విభేదాలకు సంబంధించి సీఎంతో చర్చించేందుకు బాలినేని సమావేశమైనట్టు తెలిసింది.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంలో
గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తాను పార్టీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే
తనపై వివాదాలు సృష్టిస్తూ సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల ఒంగోలులో
నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో నేతల మధ్య ఉన్న విభేదాల అంశంపై సీఎంకు బాలినేని వివరించినట్లు
సమాచారం.