కె పబ్లిక్ స్కూల్ రోడ్డులో నూతనంగా భవిత్ స్పెషల్ నీడ్ డెవలప్మెంట్ సెంటర్ ను
ప్రారంభించారు. సెంటర్ ను సమతా సైనిక్ దల్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి
మహేశ్వరావు, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ లాంఛనంగా
ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి
కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన
వారి శిక్షణ కోసం భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను
భవానిపురంలో ఏర్పాటు చేయడం శుభపరిణామని కొనియాడారు. సాధారణ పిల్లలకు
విద్యాబుద్ధులు చెప్పాలంటేనే ఎంతో కష్టంగా మారిందని, అటువంటి పరిస్థితుల్లో
మానసికంగా బలహీనం గా ఉండే విభిన్న ప్రతిభావంతులైన వారికి శిక్షణ ఇవ్వడం ఎంతో
ఓర్పుతో కూడుకున్న విషయమని కొనియాడారు. విభిన్న ప్రతిభా వంతులైన వారికి శిక్షణ
ఇచ్చి సాధారణ పిల్లలుగా వారిని సమాజంలో తీర్చిదిద్దడం
గొప్పవిషయమన్నారు…భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్
ప్రిన్సిపాల్,వైస్ ప్రిన్సిపాల్ జె. సునీత,జె.ప్రసాద్ మాట్లాడుతూ విభిన్న
ప్రతిభావంతులైన వారికి సేవ చేయాలనే సదుద్దేశంతో భవిత్ స్పెషల్ నీడ్
డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ భవానిపురం,
ఇబ్రహీంపట్నం, కొండపల్లి,చిట్టినగర్, వన్ టౌన్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇటువంటి
సెంటర్ లేదని, అటువంటి వారు నగరంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న సెంటర్ లకు
వెళ్లేందుకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, అటువంటి వారికోసం మొట్టమొదటి
సారిగా భవానిపురంలో భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు
చేశామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన వారిపట్ల భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్
డెవలప్మెంట్ సెంటర్ ప్రేమ ఆప్యాయలతో మెలుగుతూ వారిని తీర్చిదిద్ది సమాజంలో
వారికి గుర్తింపుతో వారి భవిష్యత్ కు భరోసాగా భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్
డెవలప్మెంట్ సెంటర్ ఉంటుందని తెలిపారు.
భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో స్పీచ్ థెరపీ,స్పెషల్
ఎడ్యుకేషన్,ఫిజియో థెరపీ,ఆక్యుపేషనల్ థెరపీ,బిహేవియర్ థెరిపీ, సెన్సరీ
థెరపీ,విజన్ థెరపీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజయవాడ నగర
వాసులు భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు
వినియోగించుకోవాలని కోరారు. భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో
దశాబ్దాలుగా విభిన్న ప్రతిభావంతులకు సేవలు అందిస్తున్న అనుభవం కలిగిన టీచింగ్
ఫ్యాకల్టీ ఉన్నారని తెలిపారు. సాధారణ పిల్లలుగా విభిన్న ప్రతిభావంతులను
తీర్చిదిద్దడమే భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్
ముఖ్యుద్దేశ్యామని.అన్నారు. నెలల వయస్సు వారి నుండి పెద్ద వయస్సు కలిగిన
విభిన్న ప్రతిభావంతుల వారు సైతం భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్
లో జాయిన్ అవ్వొచ్చని తెలిపారు. సెంటర్ సేవల వివరాల కోసం ప్రిన్సిపాల్
జె.సునీత 9985951397 ఫోన్ నంబర్ సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో భవిత్
స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సిబ్బంది, విభిన్న ప్రతిభావంతులైన
పిల్లల తల్లిదండ్రులు, టీవీ5 బ్యూరో చీఫ్ పావులూరి రమేష్ బాబు, ఏపీజేఎఫ్
రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణంజనేయులు పాల్గొన్నారు.