న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జీవో
115పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వ్యాపారవేత్త
కాట్రగడ్డ లలితేష్‌కుమార్‌కు విశాఖపట్నం మర్రిపాలెంలో ఉన్న 17,135 చ.మీ.
భూమిని వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 115 జారీ చేసింది. గతంలో ఈ
జీవోను కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్
బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.
హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. హైకోర్టు
తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ప్రభుత్వమే భూమి ఇచ్చి మళ్లీ వెనక్కి
తీసుకుంటుందా? అని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ హైకోర్టు
తీర్పునే సమర్థించింది.