విజయవాడ : ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలో చెన్నై వెళుతున్న కోరమండల్
ఎక్స్ప్రెస్ – గూడ్స్ రైలును ఢీకొన్న సంఘటనలో పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షులు
సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. బాలాసోర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్
వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సోము వీర్రాజు
వెల్లడించారు. ఈ అంశం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ
ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాజమండ్రి నుంచి
తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సోము వీర్రాజు ఈ విషయం తెలిసిన వెంటనే ప్రమాద
ఘటనపై రైల్వే శాఖ మంత్రి రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సహాయ కార్యక్రమాలపై
మాట్లాడారు. తిరుపతి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగే పార్టీ కార్యక్రమాల్లో
పాల్గొనే నిమిత్తం సోము వీర్రాజు రైల్లో రాజమండ్రి నుండి తిరుపతి
బయలుదేరారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. మృతి
చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ తన వంతు సహాయం అందిస్తుందని, క్షతగాత్రులను
కాపాడుకోవటానికి ప్రత్యేక బృందాలు తగు చర్యలు తీసుకుంటున్నట్లుగా రైల్వే శాఖ
నుండి తనకు తెలిపారని సోము వీర్రాజు వెల్లడించారు.