భువనేశ్వర్ : ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వేస్టేషన్
వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన.. ముమ్మరంగా సహాయకచర్యలు
చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది
సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ‘‘క్షతగాత్రులకు మెరుగైన చికిత్స
అందిస్తున్నాం. ప్రస్తుతం సహాయకచర్యలపై పూర్తిగా దృష్టి సారించాం. ఘటనాస్థలిలో
సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైలు ప్రమాద కారణాలను
ఇప్పటికిప్పుడు చెప్పలేం. ప్రమాద ఘటనపై విచారణ చేసి మరిన్ని వివరాలు చెబుతాం.
విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశాం’’ అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.