టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ : ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ
రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఒకేసారి 200 మందికి
పైగా ప్రాణాలు కోల్పోవడం మనసు జీర్ణించుకోలేకపోతోందని, మృతుల కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతి. వారికి మనోస్థైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
గాయపడిన వారికి ఒడిశా ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. రాష్ట్ర
ప్రభుత్వం రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను
సేకరించాలని, వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు
చేపట్టాలని, మృతుల కుటుంబాలను కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి
చేశారు.