రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘ఎలక్ట్రానిక్
ఇంటర్‌లాకింగ్’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు
వచ్చినట్లు వెల్లడించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని
పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
రైల్వే భద్రతా విభాగ కమిషనర్ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ
జరిపారని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని
కనిపెట్టారన్నారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి
నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం
పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని
లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా రైళ్ల రాకపోకలు తిరిగి
ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈరోజు రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు
ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం లో 288 మంది
దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇంకా
కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే దాదాపు 288కి చేరింది. కేంద్ర రైల్వేశాఖ
మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రాక్ పునరుద్ధణ పనులను పర్యవేక్షించారు. ఈ
సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి అశ్వినీ
వైష్ణవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం కారణంగా పాడైపోయిన ట్రాక్
పనులను పునరుద్దరిస్తున్నాము. బుధవారం ఉదయానికి మిగతా పనులను పూర్తి చేసి
రైళ్ల రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే
రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారు. రిపోర్టు
అందాల్సి ఉంది. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని
తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని
చెప్పారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్
మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఒడిశా
రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన
నడుస్తున్నాయి. ఒకదానిపైన మరొకటి ఎక్కిన బోగీలను ఇప్పటికే కష్టపడి తొలగించారు.
వీలైనంత తొందరగా ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు నిరంతరాయంగా వందలాది మంది
కార్మికులు, నిపుణులు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.