ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు
అన్‌రిజర్వుడ్ ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం : ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్‌పూర్
ఎక్స్ప్రెస్ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని ఆంధ్రప్రదేశ్
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన
మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు. ఒడిశాలో ప్రమాదానికి గురైన
కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్ప్రెస్ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు
ప్రయాణించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన
మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు. ఏపీ ప్రయాణికుల్లో 553 మంది
సురక్షితంగా ఉన్నారని, 92 మంది తాము ట్రావెల్ చేయలేదని తెలిపినట్లు చెప్పారు.
మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదన్నారు. ఫోన్ నంబర్
ఆధారంగా లొకేషన్లు గుర్తించి వారి ఇళ్లకు అధికారులను పంపి వివరాలు
తెలుసుకుంటున్నామని చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని, వారికి
చికిత్స కొనసాగుతున్నట్లు బొత్స వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అమర్నాథ్, ఆరుగురు అధికారులు ఒడిశా వెళ్లి
అక్కడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిపై
సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు చేరవేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రిజర్వేషన్ చార్ట్ ప్రకారం కోరమాండల్‌లో 484, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో
211 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు బొత్స చెప్పారు. యశ్వంత్‌పూర్
ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతిలో 107 మంది ఎక్కారని తెలిపారు. అన్‌రిజర్వుడ్
ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ సమాచారాన్ని ఒడిశాలోని వివిధ
ఆస్పత్రుల నుంచి మంత్రి అమర్నాథ్, అధికారుల బృందం సేకరిస్తోందని చెప్పారు.
ఇంకా 180 మృతదేహాల వివరాలను గుర్తించాల్సి ఉన్నట్లు అక్కడి నుంచి తమకు సమాచారం
వచ్చిందన్నారు.
ఒడిశాలో త్రీవ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో దాదాపు 240 మంది
మృతిచెందిన విషయం తెలిసిందే. ఏపీలోకి శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి(60)
కూడా ఈ ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా
నిలుస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి బొత్స ఆదివారం
మీడియాతో మాట్లాడుతూ ఒడిషా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందారు.
మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించాం. ఏపీలో పెన్షన్
తీసుకుని వెళ్తుండగా గురుమూర్తి మృతిచెందాడు. బాలాసోర్‌లో గురుమూర్తి నివాసం
ఉంటున్నారు. గురుమూర్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా
ప్రకటించింది. అలాగే, బాధితులకు కూడా పరిహారం అందిస్తున్నామన్నారు. ఈ
ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణీకులను 695 మందిని గుర్తించాం. 553 మంది
సురక్షితంగా ఉన్నారని, గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం.
విశాఖ ఆసుపత్రిలో ఐదుగురికి చికిత్స అందిస్తున్నాం. స్వల్ప గాయాలైన 11 మందికి
చికిత్స అందించి పంపించామని తెలిపారు.