హైదరాబాద్ : ఆరోగ్య పర్యాటకంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని మోదీ
కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జీ 20
హెల్త్ వర్కింగ్ గ్రూప్‌నకు సంబంధించి మూడో సమావేశానికి ఆయన హాజరై
మాట్లాడారు. ప్రపంచానికే హైదరాబాద్ ఫార్మసీ, వ్యాక్సిన్ రాజధాని అని
చెప్పారు. నాణ్యమైన వైద్య విధానాలు భారత్‌లో శతాబ్దాల క్రితమే ఉన్నాయన్నారు.
‘‘ఆయుర్వేదం 5వేల ఏళ్లనాటి వైద్యం. ఆయుర్వేదం ఆరోగ్యవంతమైన, సుదీర్ఘ
జీవితానికి ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా పెంపొందిస్తుంది.
ఆయుర్వేదం, సిద్ద, యునానీ, యోగా వంటివి శతాబ్దాల క్రితమే ఉన్నాయి. హెల్త్
టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి. వ్యాక్సిన్లలో 33 శాతం భారత్‌లోనే
తయారవుతున్నాయి. 2030నాటికి యూనివర్శల్ హెల్త్‌కేర్ కవరేజ్‌ని సాధించాలని
కృషి చేస్తున్నాం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.