పోలాకి : ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన బాధితుల పట్ల
సీఎం జగన్మోహనరెడ్డి ఎంతో మానవత్వంతో స్పందించారని మాజీ డిప్యూటీ సీఎం,
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు
సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారికి వారు
కోలుకోవడానికి వీలుగా సత్వర చర్యలు ఏర్పాటు చేయడమే కాకుండా పరిహారాన్ని కూడా
ప్రకటించి ఆదుకున్నారని చెప్పారు. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన
వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష మంజూరు చేసి సీఎం
జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని ధర్మాన కృష్ణదాస్ ధన్యవాదాలు తెలిపారు.
సహాయ, పునరుద్ధరణ, వైద్య సదుపాయాల కల్పన, అంబులెన్స్‌లు, సహాయ డెస్క్ ల
ఏర్పాటు, ప్రత్యేక బృందాన్ని పంపించడం తదితర అంశాల్లో ఏపీ ప్రభుత్వం
స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని అన్నారు.