అమరావతి : పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియతో మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పేరుగాంచిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై
కేంద్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి
నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ మంట
గలుపుతున్నారని.. కేంద్ర ప్రభుత్వ దుష్టపన్నగాలను తిప్పి కొట్టడంలో రాష్ట్ర
ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర
అభివృద్ధికి నిధులు సాధించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని
ఆరోపించారు.