ప్రతిఇంటికీ సురక్షిత మంచినీరు అందేలా చూడాలి * ఒక నిర్ధిష్ట కాలవ్యవధిలో
పూర్తి చేసేందుకు చర్యలు * ఘన,ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు
అవసరమైన అన్ని చర్యలు * కేంద్ర తాగునీరు, శానిటేషన్ శాఖ కార్యదర్శి విని
మహాజన్
వెలగపూడి : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న జల్
జీవన్ మిషన్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందేలా అవసరమైన
చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర తాగునీరు, శానిటేషన్ శాఖ కార్యదర్శి
విని మహాజన్ సూచించారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డితో ఆమె కొద్దిసేపు భేటీ అయ్యారు.
అనంతరం జల్ జీవన్ మిషన్,స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలపై రాష్ట్ర
స్థాయి అధికారులతో సమావేశం కావడంతో పాటు జిల్లా కలక్టర్లతో దృశ్యమాద్యమం
ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా విని మహాజన్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ
సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్
కార్యక్రమాన్ని ఒక నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం
జరుగుతోందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సురక్షిత మంచినీరు అందించాలన్నదే
జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆదిశగా అధికారులు తగిన చర్యలు
తీసుకోవాలని స్పష్టం చేశారు. జల్ జీవన్, స్వచ్ఛభారత్ మిషన్ పనులను రాష్ట్రంలో
పటిష్టంగా అమలు పర్చి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. జల్ జీవన్ మిషన్
అమల్లో భాగంగా 2024 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు కుళాయి కనక్షన్లు
ద్వారా తగినంత ప్రమాణంలో శుద్దమైన త్రాగునీటిని అందించాలని కేంద్ర కార్యదర్శి
విని మహాజన్ తెలిపారు. కాలాలు,ఋతువులతో ఏమాత్రం సంబంధం లేకుండా అన్ని
కాలాల్లో, ఋతువుల్లో త్రాగునీరు నేరుగా గృహాలకే సరఫరా అయ్యేలా చర్యలు
చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్నిఆరోగ్య పరిరక్షణ అంశంగా
భావించి పెద్దఎత్తున విజయవంతంగా అమలు చేయాలని కేంద్ర కార్యదర్శి విని మహాజన్
అధికారులకు సూచించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటికీ తప్పని సరిగా మంచినీటి
కుళాయి సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.ఇందుకుగాను గ్రామ
పంచాయితీలన్నిటినీ పూర్తిగా బలోపేతం చేసి మహిళా స్వయం శక్తి సంఘాలను దీనిలో
పెద్దఎత్తున భాగస్వాములను చేసి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని
చెప్పారు. ఘన,ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని
చర్యలు చేపట్టాలని, వ్యర్థాలను లాభదాయక వనరులుగా వినియోగించుకొనే అంశాలపై
ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అదే విధంగా స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం
అమలుపై ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికీ విధిగా మరుగుదొడ్డిని నిర్మించి బహిరంగ
మలవిసర్జన లేని గ్రామం, రాష్ట్రం,దేశంగా తీర్చిదిద్దే రీతిలో కృషి చేయాల్సిన
అవసరం ఎంతైనా ఉందని విని మహాజన్ చెప్పారు.అలాగే ప్రతి ఇంటి నుండి ఘణ,ద్రవ
వ్యర్ధాలను వేరువేరుగా సేకరించి వాటిని సక్రమ పద్ధతిలో నిర్వహించేందుకు తగిన
చర్యలు తీసుకోవాలని అన్నారు. ఘన, ద్రవ వ్యర్ధాలను ఏవిధంగా వేరు చేయాలనే దానిపై
ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన పెంపొందించాలని కేంద్ర కార్యదర్శి విని మహాజన్
సూచించారు.ద్రవ వ్యర్థాలు గ్రామాల్లో ఏమాత్రం నిలువ ఉండటానికి వీలు లేదని,
భూమిలో ఇంకిపోయేలా తగు ఏర్పాట్లు చేయాలని, వాటి పారుదలకు అవసరమైన డ్ర్రైన్ల
నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జల్ జీవన్
మిషన్,స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికీ
కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పెద్దఎత్తున చర్యలు
తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు దేశంలో ఏ
రాష్ట్రంలోను లేనివిధంగా గ్రామ స్థాయిలో గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు
అందుబాటులో ఉన్నాయని తెలిపారు.విలేజ్ హెల్తు క్లినిక్లు అందుబాటులోకి వచ్చాక
వర్షాకాలంలో వచ్చే డయేరియా కేసులు పూర్తిగా తగ్గాయని చెప్పారు.అలాగే ప్రతి
ఇంటి నుండి వచ్చే ఘన, ద్రవ వ్యర్ధాలను వేరు వేరుగా సేకరించి వాటిని సక్రమ
విధానంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
బి.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ కుళాయి,మరుగుదొడ్డి సౌకర్యాన్ని
కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోను ప్రత్యేక దృషి
సారించినట్టు వివరించారు. ఘన, ద్రవ వ్యర్ధాలను వేరు చేసే అంశంపై ప్రజల్లో
పెద్దఎత్తున అవగాహన కల్పిచేందుకు ఒక కార్యశాలను కూడా నిర్వహించడం జరిగిందని
పేర్కొన్నారు. పై అంశాలపై ప్రజల్లో వారి నడవడికలో మార్పు తెచ్చేందుకు అన్ని
విధాలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత కృషి సల్పి ఈ
కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు తగిన చర్యలు
తీసుకుంటున్నట్టు వివరించారు. అంతకు ముందు కేంద్ర త్రాగునీరు మరియు
పారిశుద్ద్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో అమలు
అవుతున్న జల్ జీవన్ మరియు స్వచ్చభారత్ మిషన్ పనుల వివరాలను, ఇప్పటి వరకు
సాధించిన ప్రగతిని మరియు ఇంకా సాధించాల్సిన లక్ష్యాలను వివరించారు. అనంతరం
జిల్లా కలక్టర్లతో ఈఅంశాలపై దృశ్య మాద్యమం ద్వారా సమీక్షించారు. ఈలక్ష్యాల
సాధనలో జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్లు కీలక పాత్ర పోషించాలని కేంద్ర
కార్యదర్శి విని మహాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
సూచించారు. ఈసమావేశంలో కేంద్ర జల్ జీవన్ మిషన్,స్వచ్ఛ భారత్ మిషన్ విభాగానికి
చెందిన సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్లతో పాటు రాష్ట్ర పంచాయితీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ సూర్యకుమారి, పలువురు ఇంజనీర్లు,ఇతర అధికారులు
తదితరులు పాల్గొన్నారు.